శేరిలింగంపల్లి, అక్టోబర్ 31:అర్జున్ సమాచారం:
హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై గచ్చిబౌలి పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 27 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని ది స్కై బై విహారా ఫామ్లో అందర్ బహార్ పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ దాడి చేపట్టారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో 27 మంది పట్టుబడ్డారు. ప్రాథమిక విచారణలో చిన్న యాదవ్ (బీఎన్ రెడ్డి నగర్), సోను (సన్సిటీ), నవీన్ అనే వ్యక్తులు గత నాలుగు నెలలుగా ఈ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. ఈ స్థావరంలో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల మేర పేకాట లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిసింది. దాడిలో రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై మరింత విచారణ చేపట్టారు. పేకాట నిర్వహణకు సంబంధించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
===============